Trending Now

అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ కో కన్వీనర్ గా ఎంఎ లతీఫ్..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 8 : సమీపిస్తున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాల వారీగా ఆయా బాధ్యులను నియమిస్తూ ముందుకు వెళుతుంది. అందులో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంటరీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్, ముధోల్ నియోజకవర్గం పరిశీలకుడి గా నిర్మల్ జిల్లా బైంసా పట్టణానికి చెందిన కాంగ్రెస్ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎంఏ లతీఫ్ ను నియమించింది. ఎంఏ లతీఫ్ విద్యార్థి దశ నుంచే సంఘసేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ కులమతాలకు అతీతంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. సుమారు 16 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో ఉండి.. ఆయా పదవులను పొంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై నిత్యా పోరాటాలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నరు.

ముఖ్యంగా కరోనా సమయంలో ఎం ఎ లతీఫ్ తన ప్రాణాలను తెగించి ముధోల్ తో పాటు నిర్మల్ నియోజకవర్గం లోని పలు గ్రామాలలో కులమతాలకు అతీతంగా అన్నదానం, ఇతర అత్యవసర వినియోగ సామాగ్రిని ఇంటింటికి వెళ్లి కరోనా బాధితులకు అందజేయడం జరిగింది. ఆయన సేవ గుణాన్ని చూసిన అప్పటి జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారాన్ని కూడా అందజేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఎన్నికల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ గా, ముధోల్ నియోజకవర్గం ఎన్నికల పరిషత్ పరిశీలకుడిగా అవకాశం కల్పించడం మరింత బాధ్యతను పెంచిందని.. తాను బాధ్యతతో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం ముస్లిం మైనార్టీ లతోపాటు అన్ని సామాజిక వర్గాలను కలుస్తూ.. ప్రణాళిక బద్ధమైన రీతిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

Spread the love

Related News

Latest News