Trending Now

అదిలాబాద్‌పై మూడు రంగుల జెండా ఎగురవేస్తాం..

అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల కో కన్వీనర్ ఎంఏ లతీఫ్..

నిర్మల్ ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10 : లోకసభ ఎన్నికలలో అదిలాబాద్ ఎంపీ సీట్లు కైవాసం చేసుకుని మూడు రంగుల జెండాను ఎగరవేస్తామని లోకసభ ఎన్నికల కో కన్వీనర్ ఎంఏ లతీఫ్ పేర్కొన్నారు. బుధవారం బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న నాకు పార్టీ కోకనూర్ బాధ్యతలను అప్పగించడం మరువలేనని అంకితభావంతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం అన్ని వర్గాలను కలుపుకొని పోయి భారీ మెజార్టీతో గెలిపించడం జరుగుతుందని ఎంఏ లతీఫ్ పేర్కొన్నారు.

పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ ఆదేశించే ప్రణాళిక ఆధారంగా పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే, యూత్ కాంగ్రెస్ ముధోల్ తాలూకా కన్వీనర్ అట్టల్ దేవిదాస్, మాజీ సర్పంచ్ మధు పటేల్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ భైంసా పట్టణ అధ్యక్షులు శరత్ డోంగ్రే, మాజీ సర్పంచ్ ప్రకాష్ జట్టేకర్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News