నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి )ఏప్రిల్ 7 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్మల్ అసెంబ్లీ పరిశీలకులుగా జిల్లా కేంద్రానికి చెందిన ఎం. ఏ మతిన్ నియమితులయ్యారు. ఈ మేరకు సాయంత్రం ఆదివారం ఎఐసీసీ మైనార్టీ విభాగం వైస్ చైర్మన్, తెలంగాణ ఇన్చార్జ్ ఫర్హాన్ ఆజ్మీ నియమాకాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఏ మతిన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయం కోసం నిర్మల్ నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను సమన్వయం చేస్తూ.. ముందుకు వెళ్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ వినూత్న సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించి.. వారంతా కాంగ్రెస్ కు ఓటు వేసేలా తనదైన రీతిలో అవగాహన కల్పించడం జరుగుతుందని సందర్భంగా తెలిపారు. ఇప్పటికే నిర్మల్ జిల్లా కేంద్రంలోని 42 వార్డులతో పాటు పరిసర మండలాలలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలలో దూసుకెళ్తున్నామని చెప్పారు.