Trending Now

రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయురాలు ప్రతిభ..

విన్నూత్న బోధన పద్ధతిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ

ప్రతిపక్షం, దుబ్బాక, జూన్ 29: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న వి. మాధవి వినూత్న బోధనాపద్దతిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణాసంస్థ( ఎస్ సి ఈ ఆర్ టి) వారు 2023-24 సంవత్సరాలకు గాను హార్బింజర్స్ ఆఫ్ ఛేంజ్ పుస్తకంలో మాధవి సక్సెస్ స్టోరీని ప్రచురించారు.

వినూత్నమైన బోధన ఉపకరణాలు ఉపయోగించి, విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించి వారిలో విజ్ఞానాన్ని పెంపొందించెందుకు కృషి చేశారు. ఉపాధ్యాయురాలు ప్రతిభను గుర్తించిన (ఎస్ సి ఈ ఆర్ టి)వారు ఆమె సక్సెస్ స్టోరీని హార్బీంజర్ ఆఫ్ చేంజ్ పుస్తకంలో ప్రచురించారు. లచ్చపేట పాఠశాల పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపినందుకు ఉపాధ్యాయురాలు మాధవి ని గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Spread the love

Related News

Latest News