700 మందికి ఉద్యోగ అవకాశాలు
ప్రతిపక్షం ఖానాపూర్, జూలై 12:
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఏ ఎంకే ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో మహా మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై జాబ్ మేళా నిర్వహణను పరిశీలించారు.ఈ మేళాలో ఇంద్రవెల్లి, సిరికొండ, ఉట్నూర్, జన్నారం, దస్తురాబాద్, కడం, పెంబి, ఖానాపూర్ మండలాల నుండి వచ్చిన నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొన్నారు. సుమారు 4500 మందికి పైగా నిరుద్యోగులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 800 విద్యార్థిని, విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇక 179 మందికి ప్రత్యక్షంగా నియామక పత్రాలు (జాబ్ లెటర్లు) పంపిణీ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థుల కోసం వివిధ కంపెనీలు ఉద్యోగాలు కల్పించాయి. మిగిలిన విద్యార్థులకు హైదరాబాద్ లోని కంపెనీల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసినట్టు కూడా నిర్వహించడం నిర్వహించడం నిర్వాహకులు తెలిపారు.పాల్గొనే నిరుద్యోగులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు సుమారు 5000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడమేగాక, వారికీ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్టు భూక్య జాన్సన్ నాయక్ పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం జులై 12 తారీకు రోజున ఖానాపూర్ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.