ప్రతిపక్షం, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 11: మహాత్మ జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శనీయుడని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీస్ లో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వ్యవస్థ, అణగారిన కులాలకు విద్యను అందించడంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు. అలాగే అణగారిన వర్గాల అభివృద్ధి, వారి రాజకీయ న్యాయం అందించడానికి నిరంతరం పోరాటం చేశారన్నారు.