ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. దీని కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఉపఎన్నికలో మన్నె జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), నవీన్‌కుమార్‌రెడ్డి (బీఆర్ఎస్), సుదర్శన్‌గౌడ్ (స్వతంత్ర అభ్యర్థి) బరిలో ఉన్నారు.