ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ను ఈసీ వాయిదా వేసింది. రేపు కౌంటింగ్ జరగాల్సి ఉండగా, పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. మార్చి 28న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది.