ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం కోసం షాద్ నగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు స్వచ్ఛందంగా తరలి వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వస్తుండడంతో ఈ సందర్భంగా వందలాది వాహనాలతో కలిసి కార్యక్రమానికి వెళ్తున్నట్టు ఎమ్మెల్యే శంకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగిస్తుందని అన్నారు. చల్లా వంశీచంద్ రెడ్డితో జిల్లా బాగుపడుతుందని అన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా చివరకు కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని అన్నారు.