Trending Now

మహిళలపై దాడులు చేసేది బీజేపీయే..

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు..

హైదరాబాద్ , ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: దేశంలో మహిళలపై దాడులు చేసేది, లైంగిక పాల్పడేది బీజేపీ నేతలేనని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆరోపించారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియా ప్రతి నిధుల సమశ్వేశంలో ఆమె మాట్లాడుతూ.. వందలాది మంది స్త్రీలపై లైంగిక దాడులు చేసిన బీజేపీ నేత ప్రజ్వల్ రేవన్నపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సునీతా రావ్ ప్రశ్నించారు. జర్మనీ కి పారిపోయిన ఈ విషయం ప్రధాన మంత్రి అలాగర్ హోమ్ మంత్రి అమిత్ షా కు తెలుసని అన్నారు.

బేటీ పడవో భేటీ బచావో నినాదం ఇస్తూ మహిళలను లైంగిక దాడులు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. రెవన్న తండ్రి, కొడుకులు నీచమైన సంఘటనకు పాల్పడుతున్నారని తెలిపారు. బయటి దేశం పారిపోయిన రేవన్న అరెస్ట్ చేసి దేశానికి తీసుకువచ్చి శిక్షించాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో దేశంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ఏమవుతుందోనన్న భయం దేశంలోని ప్రజలకు ముఖ్యంగా మహిళలు భయపడుతున్నారని తెలిపారు.

ప్రధాని, అమిత్ షా నిద్ర పోతున్నారా..?

దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోకుండా ప్రధాని, హోమ్ మంత్రి అమిత్ షా నిద్ర పోతున్నారా అంటూ దునీతా రావ్ ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదన్నారు. మాఫీ కాబినెట్ లోని మహిలా మంత్రులు నిర్మలా సీతారామన్ తో పాటు మిగతా వారు రేవణ్ణ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు న్యాయం జరగకపోతే చెప్పుల దాడి చేస్తాం అంటూ సునీతా రాబ్ హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రధాని నోరు తెరవాలని, లేకుంటే 58 % ఉన్న మహిళలు బీజేపీని ఓడిస్తారని ఆమె హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News