ప్రతిపక్షం, ప్రతినిధి సిద్దిపేట, జూన్ 14: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గజ్వేల్‌లో జరిగే విద్యా సదస్సు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన టీపీటీఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు జి. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో టీపీటీఎఫ్ మాసపత్రిక “ఉపాధ్యాయ దర్శిని” ప్రధాన సంపాదకులు ప్రకాష్ రావు గారి ఉద్యోగ విరమణ సందర్భంగా టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే విద్యా సదస్సుకు ఉపాధ్యాయులు, మేధావులు, విద్యా అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో “సంక్షేమంలో సామాజిక విలువలు”అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాసీం గారు, “విద్యారంగా సంక్షోభం కర్తవ్యాలు” అనే అంశంపై ఏపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ఏ. నరసింహారెడ్డి గారు, ఆటపాట మాట అనే అంశంపై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క గారలు వక్తలుగా ప్రసంగిస్తారన్నారు. విద్యా సదస్సు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు పీ. శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కే. కృష్ణ నాయకులు అశోక రెడ్డి , అంజిరెడ్డి, పద్మావతి, శ్రీలత, కృష్ణవేణి, జ్యోతి, శశికళ ,ఉజ్వల, సరస్వతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.