లాభాల్లో ఐదు శాతం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు..
ఇప్పటికి 246 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మలబార్ గ్రూప్
ప్రతిపక్షం, ఎల్బీనగర్, మే 28: వ్యాపార రంగంలో మలబార్ గ్రూప్ పోటీతత్వానికి నిలబడి వచ్చిన లాభాలలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయడం అభినందనీయమని వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. వనస్థలిపురం బ్రాంచ్ మలబార్ గ్రూప్‌లో మంగళవారం బ్రాంచ్ మేనేజర్ నాగరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సామాజిక సేవా కార్యక్రమం ‘ఆకలి- రహిత ప్రపంచం’ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, స్టోర్ హెడ్ ఇషాక్, కస్టమర్ శంకర్ లతో కలసి వరల్డ్ హంగర్ డే లోగోను విడుదల చేశారు. మలబార్ గ్రూప్ అర్జించిన లాభాల్లో ఐదు శాతం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ.. ప్రతిరోజూ నిరుపేదలకు పౌష్టిక పోషక భోజనాన్ని అందిస్తున్నారు.
ఇప్పటికి అందిస్తున్న 31 వేల ఆహార ప్యాకెట్లను ఇకనుంచి 51వేల పౌష్టిక ఆహార ప్యాకెట్లకు పెంచుకుంటూ పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రపంచం నుండి ఆకలిని తరిమి వేయడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలు, ఏజెన్సీలకు మద్దతుగా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మలబార్ గ్రూప్ స్పష్టం చేసింది. మలబార్ గ్రూప్, ధనల్ నిలంటీరు వీధులు, పట్టణ శివారు ప్రాంతాలలో నిరుపేదలను గుర్తించి, ఆహార ప్యాకెట్లను వారి ఇంటి వద్దకే తీసుకుని వచ్చి అందించడం వారి సేవలకు నిదర్శనం.