Mollywood Hero Mohan lal Resign AMMA: మలయాళ సినీ పరిశ్రమను కాస్టింగ్ కౌచ్ కుదిపేస్తోంది. మహిళల స్థితిగతులపై ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక సమర్పించింది. కొంతమంది అగ్రనటులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కొంతమంది నటీమణులు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ ‘అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టీస్ట్స్)’ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
‘అమ్మ’ అధ్యక్షుడితోపాటు 17 మంది మంది సభ్యులు కూడా పదవులకు రాజీనామా చేశారు. అయితే, కమిటీలో కొంతమంది సభ్యులపై సైతం లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో నైతిక బాధ్యతగా అందరూ రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. దీంతో అమ్మ కమిటీ రద్దు అయింది. మరో రెండు నెలల్లో కొత్త కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.