Trending Now

ఎమ్మెల్సీగా “మన్నే జీవన్ రెడ్డి” గెలుపు ఖాయం..

జీవన్ రెడ్డి గెలుపుతో మహబూబ్ నగర్ జిల్లాకు ప్రయోజనం

ప్రతిపక్షం, షాద్​నగర్​: గురువారం జరగబోయే మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప కాంగ్రెస్​పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకేనని పీసీసీ సభ్యులు, కాంగ్రెస్​సీనియర్​నేత మహమ్మద్​అలీఖాన్​ బాబర్​అన్నారు. నేడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐ.న్.టి.యు.సి రాష్ట్ర నాయకులు రఘు, ఫరూక్ నగర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గండ్రతి బాలరాజ్ గౌడ్, సీనియర్ నేత చెంది తిరుపతి రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. కాంగ్రెస్​అభ్యర్థి, పారిశ్రామిక వేత్త మన్నె జీవన్​రెడ్డి మంచి నాయకుడుగా పేరుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జిల్లా వ్యాప్తంగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల నుండి మంచి స్పందన లభిస్తుందని అన్నారు.

జీవన్ రెడ్డి గెలుపుతో పాలమూరు పారిశ్రామిక ప్రగతికి బాట పడుతుందన్నారు. కాంగ్రెస్​అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్​ఎస్​అభ్యర్థి నవీన్ రెడ్డిలను పోల్చుకుంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఇరువురి మధ్య ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలాంటి వాడో షాద్​నగర్ ప్రజలకు తెలుసని, జిల్లా వ్యాప్తంగా ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీలకు భిన్నంగా జీవన్​రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. అమాయకుల భూములు గుంజుకొని, భూ దందాలు నెరపడంతో పాటు ఆయనపై ఇటీవల హత్యానేరం సైతం కేసు ఉందన్నారు. ఆత్మగౌరవంతో ఓటు వేయాలని కోరుతున్న నవీన్ రెడ్డి తన ఆత్మపై ఎంత గౌరవం ఉందో వారి ఊరికి వచ్చి ప్రజలను తెలుసుకోవాలన్నారు. మీడియా సమావేశంలో అగ్గనూరు బసప్ప, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News