Trending Now

హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లోక్‌సభ ఎన్నికల ముందు హర్యానా రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమి విచ్ఛిన్నమైంది. హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. తాజా పరిణామంతో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సొతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ రోజే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. కాసేపట్లో బీజేపీఎల్పీ సమావేశం నిర్వహించి తదుపరి సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేసులో నయబ్‌సైనీ ఉన్నట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News