ప్రతిపక్షం, మంథని మార్చి 29 : హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును మంథని నియోజక వర్గ కాంగ్రెస్ నేతలు శుక్రవారం కలిశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా నియమితులైన సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండలం ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, మంథని అసెంబ్లీ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, ఎంపీటీసీ కొప్పుల గణపతి, ఆరెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.