ప్రతిపక్షం, మంథని రామగిరి మే 04 : చల్లా నారాయణ రెడ్డి రాకతో మంథని బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనబడుతుందని బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. మంథని నియోజకవర్గం లోని తూర్పు మండల్లలోంచి పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ల నుండి బీజీపీ లోకి శుక్రవారం చేరికయ్యారు. వీరికి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత చల్లా నారాయణ రెడ్డి కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. మహాముత్తారం మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కల్వచర్ల రాజు, కాటారం మండల సహకార సంఘం డైరెక్టర్ గూడూరు గ్రామానికి చెందిన బండి రమేష్, కాటారం మండలం దామెరకుంట మాజీ సర్పంచ్ తోడే వీరారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఐత వీరా రెడ్డి, భూపాలపల్లి జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షులు రాజయ్య, రాజ స్వామి, లక్ష్మారెడ్డి, రాజు, శ్రీనివాస్ రెడ్డి, స్వామి యాదవ్ పర్వతాలు తదితరులు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మహాదేవపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలయ్య యాదవ్, కాంగ్రెస్ కాటారం మండల డివిజన్ అధ్యక్షులు ఆత్మకూరి స్వామి యాదవ్, కాటారం మండలం కొత్తపల్లి గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేణు నాయక్, లాకు నాయక్ మలహార్ రావు మండలం కుంభంపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి, మహేందర్ రెడ్డిలు తదితరులు శుక్రవారం రాత్రి కాటరంలోని చల్లా నారాయణరెడ్డి నీ నివాసంలో బీజేపీ పార్టీలోకి చేరికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రకౌన్సిల్ మెంబర్ సత్యప్రకాష్, బీజేపీ మంథని నియోజకవర్గం కన్వినర్ మల్క మోహన్ రావు, కాటారం మండల అధ్యక్షులు మల్లా రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మహాముత్తారం అధ్యక్షులు సంపత్, బీజేవైఎం అధ్యక్షులు శ్రీకాంత్, దుర్గం తిరుపతి, పాగే రంజిత్, రాజు బీజేపీ నాయకులు ఉన్నారు.