ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: నిర్మల్ లో భారత రాష్ట్ర సమితికి పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు రాజీనామాలు చేయడం మొదలైంది. మున్సిపల్ వార్డు 16 కౌన్సిలర్ తారక వాణి రఘువీర్, వార్డ్ నెంబర్ 10 మున్సిపల్ కౌన్సిలర్ నల్లూరి పోశెట్టిలు ఇప్పటికే బీఆర్ఎస్ కు రాజీనామా చేయగా.. తాజాగా మామడ మండల మండల పరిషత్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి, ఆరేపల్లి తాజా మాజీ సర్పంచ్ అరవిందరావు లు కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మరి కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు పటమస్తాయి బీఆర్ఎస్ పదాధికారులు నాయకులు కూడా గురువారం రోజు పెద్ద ఎత్తున రాజీనామాలు సమర్పించనున్నారు. వీరంతా ఇదే రోజు నిర్మల్ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకుంటున్నారని విశ్వాసనీయ సమాచారం. మామడ మండలంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన వారికి చేరిన స్థానికంగా ఓ కార్యక్రమం నిర్వహించి డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు పార్టీ కానువలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మామడ మండలం తో పాటు నిర్మల్ మండలంలో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తలిగే అవకాశాలు లేకపోలేవు.