Trending Now

కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికలు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 2 : నిర్మల్ డీసీసీ క్యాంప్ కార్యాలయంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూచాడి శ్రీహర్ రావు ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలంలోని బీజేపీ, బీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ చేస్తున్న పథకాలకు ఆకర్షితులై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాల ద్వారా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి, మాజీ సర్పంచ్ సంగం సురేఖ స్వామి, గ్రామ కార్యకర్తలు లక్ష్మారెడ్డి, శ్రీకాంత్, రాము, గుండ్ల సాయన్న, దమ్మ లక్ష్మారెడ్డి, పాపాయి గారి భోజ రెడ్డి, అంబేద్కర్ సంఘ సభ్యులు సాగరు నవీను, దత్తు, సాయికుమార్, గ్రామ యువకులు సంఘ పెద్ద మనుషులు, కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ అధ్యక్షుడు దొడ్డికింది రాంరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజు నరసయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మసిరుద్దీన్ రైతు కిషన్ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు అట్లా పోతా రెడ్డి, ఎన్నారై గల్ఫ్ కోఆర్డినేటర్ పరికిపండ్ల సతీష్, కాంగ్రెస్ పార్టీ సారంగాపూర్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్ పెల్లిసురేందర్, ప్యారమూర్ గ్రామ రైతులు, యువకులు, పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News