ఇద్దరిపై కేసు నమోదు..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 30 : నిర్మల్ జిల్లా ఇద్దరు వ్యక్తులు నిజామాబాద్ జిల్లా బాల్కొండ, వేల్పూర్ ,భీంగల్ మండలాలకు చెందిన పలువురు యువకులకు నిషేధిత గంజాయిని సప్లై చేస్తూ తమదైన రీతిలో అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మేరకు అందిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు వేల్పూర్ ఎస్సై వినయ్, ముప్కాల్ ఎస్సై భాస్కర చారి లు తెలిపారు. తమ సిబ్బంది తో కలిసి వెంకటాపూర్ రోడ్డు లో ఉన్న సాయి కృష్ణ రైస్ మిల్ దగ్గర వాహనాల తనఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, వారి వద్ద ఉన్న సంచిలో నుండి విలువైన నిషేధిత గంజాయి లభ్యమయిందని తెలిపారు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులను క్షుణ్ణంగా పంచనామా నిర్వహించి విలువైన నిషేదిత గంజాయి అనగా రెండు కిలోల వంద గ్రాముల స్వాధీన పరచుకున్నట్లు వేల్పూర్ ఎస్సై వినయ్, ముప్కాల్ ఎస్సై భాస్కర చారి లు వివరించారు. గంజాయితో పట్టుబడ్డ సయ్యద్ అజీం, శేఖ్ అద్నాన్ సోహెల్ లు నిర్మల్ కు చెందిన వారిగా గుర్తించారు.
వీరిద్దరూ గత కొన్ని రోజులుగా నిషేధిత గంజాయి వ్యాపారాన్ని రహస్యంగా సదరుపై ప్రాంతాలలో చేస్తూ అక్రమ సంపాదాలను సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వీరిని అదుపులోకి తీసుకొని న్యాయస్థానానికి రిమాండ్ కు పంపడం జరిగిందని వేల్పూర్ ఎస్సై వినయ్, ముప్కాల్ ఎస్సై భాస్కర చారీలు పేర్కొన్నారు. సదరు ఇద్దరు నిందితులు మహారాష్ట్ర నుండి నిషేధిత గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు సదరు ప్రాంతాలలో అమ్ముతున్నట్లు విచారణలో నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు నిషేధిత గంజాయిని ఎవరు కూడా ఎక్కడ కూడా క్రయవిక్రయాలు జరిపిన కఠినమైన రీతిలో చర్యలు ఉంటాయన్నారు. క దానిని వాడడం కూడా చట్టరీత్య నేరమేనని అలాంటి వారిని గుర్తించి కూడా కేసులు నమోదు చేస్తామని అయినా హెచ్చరించారు. యువకులు ఎవరు కూడా ఇతర నిషేధిత గంజాయి కి బానిస కాకూడదని దీనితో భవిష్యత్తు జీవితం సర్వనాశనం అవుతుందని వారు తెలిపారు. ఎవరు కూడా చెడు అలవాట్ల కు బానిస అయి కేసులలో ఇరుక్కుని భవిష్యత్ నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నామన్నారు. ఇందులో సిబ్బంది విజయ్, సందీప్, శ్రావణ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.