ములుగు, కొత్తగూడెం సరిహద్దులో ఎదురుకాల్పులు
భారీ సంఖ్యలో మావోయిస్టుల మృతి
ఇంకా కొనసాగుతున్న ఎదురుకాల్పులు
ప్రతిపక్షం ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:
రాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చాలా మంది మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ఎదురుకాల్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దు అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుండి మావోయిస్టులు, గ్రేహౌండ్స్ దళాలకు భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతిచెందినట్టు తెలుస్తోంది. మద్యాహ్నం అయినా ఇప్పటివరకు ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.