ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ఈక్రమంలో మ్యాచ్ చూసేందుకు ఉప్పల్‌కు వచ్చే క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. చివరి మెట్రో రైళ్లు వాటి టెర్మినల్ నుంచి రాత్రి 12.15 గంటలకు బయల్దేరి 1.10 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని తెలిపింది. నాగోల్, ఉప్పల్, స్టేడియం & NGRI స్టేషన్‌లలో మాత్రమే ప్రవేశం ఉంటుందని వెల్లడించింది.