ప్రతిపక్షం, కరీంనగర్: మౌలానా అబుల్ కలాం ఆజాద్ 66 వర్ధంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా పద్మాకర్ రెడ్డి, తాజ్ మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొదటి అధ్యక్షులుగా, జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో దేశ మొదటి విద్యా శాఖ మంత్రిగా పనిచేసి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి అభివృద్ధి చేశారన్నారు. పవిత్రమైన మక్కాలో పుట్టిన ఆజాద్ గారు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అఖిల్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, నిహాల్ అహ్మద్, సలీముద్దీన్, షబానా మహమ్మద్, కటకం కృష్ణ, బాశెట్టి కిషన్ ,శ్రీరాముల రమేష్ తదితరులు పాల్గొన్నారు.