ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 1 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రాంతంలో నిర్మల్ ఎలక్ట్రిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మే’ డేను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పథకాన్ని ఎగరవేసిన కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకుడు గంగాధర్, శ్రీకాంత్ లు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసము నిత్య పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు. కార్మికుల రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం మేడేను ప్రతి యేడు బాధ్యతగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్మికులందరికీ ఆయన ఈ సందర్భంగా మే డే శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులు అహ్మద్ మాట్లాడుతూ.. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సభ్యత నమోదు కార్యక్రమాలను బాధ్యతగా చేపట్టడం జరిగిందని కార్మికుల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగబద్ధమైన రీతులలో ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సంబంధిత కార్మిక శాఖ అధికారులు తమకు తగిన సలహా సూచనలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తున్నారని చెప్పారు. సంఘ సభ్యులందరూ ఐక్యంగా ఉండి సంఘ నియమ నిబంధనలను అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, గౌరవ సభ్యులు రమేష్, ఇబ్రహీం పరమేష్, గంగాధర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.