Trending Now

‘మే’ డే వర్ధిల్లాలి..

హెచ్ఎంఎస్ బీడీ కార్మిక సంఘం అధ్వర్యంలో ఘనంగా ‘మే’ డే..

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 01: సిద్ధిపేట పట్టణంలోని హెచ్ఎంఎస్ బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘మే’డే ను పురస్కరించుకొని 138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరిగింది. హెచ్ఎంఎస్ సిద్ధిపేట జిల్లా బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘మే’ డే జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సిద్ధిపేట జిల్లా బీడీ కార్మిక సంఘం అధ్యక్షులు ఇదారి మల్లేశం మాట్లాడుతూ.. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఇబ్బదులుకు గురిచేస్తూ.. కార్మిక చట్టాలను కాలరాస్తూ.. కార్మిక లోకానికి మనుగడ లేకుండా చేస్తుందన్నారు. మనమందరం కలిసి ఐక్యంగా ఉండి.. కార్మిక హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ సిద్ధిపేట జిల్లా బీడీ కార్మిక సంఘం నాయకులు మధు, లక్ష్మణ్, రాములు, స్వామి జిల్లా నాయకులు, ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News