ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి నేడు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆమెతో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి పాల్గొంటారు. మరికొందరు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం.