Medak Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు, ఓ వ్యక్తి ఉన్నారు. రహదారిపై గుంతలతో కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి కాల్వలో పడింది. డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా తూప్రాన్ దగ్గర ముత్యాలమ్మ గ్రామ దేవత ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.