టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి..
ప్రతిపక్షం, సిద్దిపేట మార్చ్ 28: నీలం మధు ముదిరాజ్ బీసీ బిడ్డకు మెదక్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం పట్ల టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి హర్షం వ్యక్తం చేశారు. గురువారం నంగునూర్ లో విలేకరులతో మాట్లాడారు. సాధారణ కుటుంబం నుండి సర్పంచ్ గా ఎన్నికైన మధు పేద ప్రజలకు అనేక సేవ కార్యక్రమాలు చేసి ముదురాజ్ లలో మంచి గుర్తింపు ఉందని గుర్తించిన అధిష్టానం తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమని అన్నారు. ఇందిరా గాంధీ భారీ అధిక్యంతో గెలిచి ప్రధాని పీఠం అధిరోహించిన ఈ స్థానం ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ముదిరాజ్ బిడ్డ కు కేటాయించడం చాలా సంతోషకరమన్నారు.