ప్రతిపక్షం, దుబ్బాక, ఏప్రిల్ 20: మెదక్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షుడు ఏసు రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్ లు అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి మెదక్ లో నామినేషన్ వేస్తున్నసందర్భంగా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాది వాహనాల్లో భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని.. దేశ ప్రజ లంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు భారీ మెజారిటీతో గెలవడం పక్కా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ ల హామీలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గడప గడపకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించి మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగర వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల భరత్, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, నాయకులు ఉషయ్య గారి రాజిరెడ్డి, కడు దూరి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.