Trending Now

Chiranjeevi: వరద బాధితులకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఎంతో మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమ ఉదారతను చాటుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రెండు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు ప్రకటించారు.

‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

Spread the love

Related News

Latest News