Megastar Chiranjeevi Place in Guinness Book Of World Records: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి విశిష్ట గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ మేరకు సినిమా ప్రముఖ దర్శకులు చిరంజీవికి అభినందనలు తెలిపారు. అనంతరం చిరంజీవితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.