Megastar Chiranjeevi invited the fan and his family: మెగాస్టార్ వీరాభిమాని ఈశ్వరయ్య ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవిపై విభిన్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. తిరుమలకు మెట్ల మార్గంలో పొర్లుదండా పెట్టుకుంటూ తిరుమల కొండ ఎక్కాడు. అనంతరం చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి మురిసిపోయి.. వెంటనే కబురు పంపాడు.
ఈశ్వరయ్యతోపాటు ఆయన కుటుంబ సభ్యులను ఇంటికి ఆహ్వానించాడు. అనంతరం కుటుంబానికి పట్టువస్త్రాలు సమర్పించి సత్కరించారు. ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటామని చిరంజీవి హామీ ఇచ్చాడు. గతంలో ఈశ్వరయ్య తిరుపతి నుంచి మెగాస్టార్ ఇంటివరకు సైకిల్ యాత్ర చేశాడు. అలాగే పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీ విజయం సాధించాలని పలుమార్లు పొర్లు దండాలతో శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, సోమవారం చిరంజీవి అయ్యప్పమాల ధరించారు. ప్రతి ఏడాది ఆయన అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.