Melania hates Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్ రాజకీయ ప్రచార ర్యాలీలలో మెలానియా ట్రంప్ కనిపించడంలేదని పలు మీడియా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ మాజీ డైరెక్టర్ ఆంథోని స్కారాముచి మెలానియా ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగునున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో భర్తకు కాకుండా ప్రత్యర్థి కమలా హారిస్‌కు మెలానియా మద్దతు ఇస్తుందని అన్నాడు. ట్రంప్ పై ఉన్న ద్వేషంతో ఎన్నికల్లో హారిస్ విజయం సాధించేందుకు అవసరమైన సహకారం ఇస్తుందన్నారు. కాగా, ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టి పడేశాడు.