ప్రతపక్షం, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్ అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని మృతిచెందారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కొంతమంది ఒకచోట చేరి హైదరాబాద్, ముంబై మ్యాచ్‌ను చూశారు. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన సమయంలో సీఎస్‌కే అభిమాని అయిన 63 ఏళ్ల బండోపంత్ హేళనగా మాట్లాడుతూ సంబరాలు చేసుకున్నారు. ఆగ్రహించిన MI ఫ్యాన్స్ అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బండోపంత్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.