ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడేలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచుల్లో తలపడగా ముంబై 18 మ్యాచుల్లో గెలిచింది. ఆర్సీబీ 14 మ్యాచుల్లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఈ రెండు టీమ్‌లు ఒక్కో మ్యాచులో మాత్రమే గెలిచాయి.
కోహ్లీ-రోహిత్ పోరు.. ఆధిపత్యం ఎవరిదంటే..?
IPL2024లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. టీమ్ఇండియా తరఫున అదరగొట్టే రోహిత్-కోహ్లీ ద్వయం పొట్టి లీగ్‌లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. RCBపై రోహిత్ శర్మ 574 పరుగులు చేయగా.. MIపై విరాట్ కోహ్లీ 852 పరుగులు చేశారు.
ఆర్సీబీపై అత్యధికంగా బుమ్రా 24 వికెట్లు తీశారు. కాగా, వాంఖడేలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 10 సార్లు తలపడగా.. ముంబై 7, ఆర్సీబీ 3 సార్లు విజయం సాధించాయి. చూడాలి మరి ఈ రోజు ఎవరు గెలుస్తారో..?