ప్రతిపక్షం, కరీంనగర్: సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా నగరంలోని ఎంఐఎం పార్టీకి చెందిన ఖాన్ పుర 4వ డివిజన్ కార్పొరేటర్ నుజహత్ పర్వీన్ అలీబాబా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు కోళ్లను పంపిణి చేశారు. సమ్మక్క సారక్క జాతరలో 4వ డివిజన్ ప్రజలు క్షేమంగా సుఖ, సంతోషాలతో ఉండాలని కార్మికులు మొక్కు చెల్లించేందుకు ఈ కోళ్ల పంపిణి చేయటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు డివిజన్ కు వెన్నెముకలాంటి వారని.. వారిని ఆదరించడం బాధ్యతని తెలిపారు. వారి కష్ట, సుఖాల్లో తోడు ఉండాలనే సంకల్పంతో జాతరకు తన వంతు సాయం అందించామన్నారు.