ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే వెలువడనుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేత మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూటమిపై సెటైర్ల పేల్చారు. చంద్రబాబు సైకిల్ తొక్కలేరు.. మోదీ నెట్టలేరంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించే మోసగాడని మండిపడ్డారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటేనే మంచిదని.. రాజకీయాలకు పనికిరాడని తెలిపారు. సీఎం జగన్ ఎవరికీ తలవంచే వ్యక్తి కాదని.. ఎంతటి వారినైనా ఎదర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడని అభివర్ణించారు.