ప్రతిపక్షం, ప్రతినిధి సంగారెడ్డి, మే1: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 1000 మార్కులకు 993 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాధించిన మెహ్రీన్ సుల్తానా తండ్రి మహమ్మద్ సుజాయత్‌ను మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. మంత్రి నివాసంలో విద్యార్థి మెహ్రీన్ సుల్తానా తండ్రి మహమ్మద్ సుజాయత్ అలీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన మెహ్రిన్ సుల్తాన్ ను అభినందించారు. ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తు లో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.