రైతు సంక్షేమ కొరకు త్వరలో యాగం చేస్తా..
శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు..
ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 17 : ప్రజా సంక్షేమమే శ్రీరాముల వారి అభీష్టమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథని నియోజకవర్గ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్ని స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాల బియ్యం సమర్పించి కళ్యాణం చివరి వరకు పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా సుఖ, సంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు వర్షాలు సకాలంలో కురిసి అధిక దిగుబడి రావాలని త్వరలో యాగం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.