ప్రతిపక్షం, మంథని(రామగిరి), మే 02 : పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ఎంపీటీసీ తీగల సమ్మయ్య స్వప్న దంపతుల ద్వితీయ పుత్రిక శ్రీ తన్వి 9.7 జీపీఏ సాధించి పట్టణ టాపర్ గా నిలువగా.. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అభినందించారు. ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ జడ్పీటీసీ ఎల్ల శశిరేఖ రామ్మూర్తి, వనం రామచంద్ర రావు, వివి స్వామి గౌడ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య, ఎరుకల బాబురావు, ఎండి చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.