ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 24 : కష్టనష్టాలను చెప్పుకుందాం అని వచ్చిన వారి సమస్యను మధ్య దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నిమిషాల్లో పరిష్కరించారు. రామగిరి మండల కేంద్రము మంథని- పెద్దపల్లి ప్రధాన రహదారి లోని సెంటినరీ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ యాజమానులు మంత్రి శ్రీధర్ బాబుని బుదవారం కలసి, రోడ్డు విస్తరణలో తమకు జరుగుతున్ననష్టాన్ని వివరించగా స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. రోడ్డు పనులు విస్తరణలో రోడ్డు ఎత్తు పెరిగి షాపులు కిందికి అవుతునందున షాపులు ఎత్తు పెంచుకోనుటకు, విద్యుత్తు లైన్ ను షాపులకు అడ్డులేకుండా మార్చుటకు అనుమతి ఇప్పించాల్సిందిగా షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు మంత్రిని కోరగా.. వెంటనే సింగరేణి ఆర్జీ-3 ఏరియా జీఎం సుధాకర్ రావుతో ఫోన్ మాట్లాడి, షాపింగ్ కాంప్లెక్స్ ఎత్తు పెంచుకోనుటకు జీఎం ని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశించారు. నిమిషాలలో తమ సమస్యలను గట్టెక్కించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు సెంటినరీ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ యాజమానులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. రామగిరి ఎంపీపీ ఆరేళ్లి దేవక్క కొమురయ్య గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, సీనియర్ నాయకుడు కాటం సత్యం తదితరులు ఉన్నారు.