హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావ అని ఆ పార్టీలో చివరికి నలుగురు మాత్రమే మిగులుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నేడు తన స్వంత గ్రామమైన బ్రహ్మనవెల్లంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బ్రాహ్మణవెల్లంల ప్రజల సమస్యల పరిష్కారం కోసం, తన సొంత ఖర్చులతో కార్యాలయం ఏర్పాటు చేస్తానని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోకి రమ్మంటే నల్గొండ జెడ్పీ ఛైర్మన్ కూడా వస్తారన్నారు. ఎన్నికల తర్వాత ప్రతీక్ పేరుతో లైబ్రరీ, ఒక్కో మహిళా సంఘానికి కోటి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ వెల్లంలను మోడల్ విలేజ్‌గా మార్చనున్నట్లు, సోలార్ విలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇవాళ మీకు కరెంట్ బిల్లు వచ్చిందా..? జీరో బిల్లు వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తుంది. సొంత ఇంటి నిర్మాణానికి రూ. అయిదు లక్షలు ఇస్తాం. ఎవరి మాట వినకండి. కాంగ్రెస్ పార్టీకే ఓటు వెయ్యండి. బ్రాహ్మణ వెల్లంలను మోడల్ విలేజ్‌గా, సోలార్ విలేజ్‌గా ఏర్పాటు చేస్తాఅ ని తెలిపారు.