ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో బుధవారం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని, పొత్తులు ఉంటేనే ఆయన పోటీ చేయగలడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు బీజేపీ, జనసేన ఊతకర్రల్లా నిలబడ్డాయని కూటమిపై సెటైర్ వేశారు. అందితే జట్టు.. అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబు నైజమని ఆయన విమర్శించారు.