Trending Now

కేసీఆర్, బండి సంజయ్‌లపై మంత్రి పొన్నం ఫైర్..

ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పును కోరుకొని, నవంబర్ 30 న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి ఓటేశారని.. డిసెంబర్ 3 న పలితాలు వచ్చి కాంగ్రెస్ గెలిచిందని.. డిసెంబర్ 7 న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా కోహెడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. శాసన సభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం పై శ్వేత పత్రం రూపంలో విడుదల చేసామని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చిన విధంగా గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నామన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ లో వర్షాకాలం రాలేదని గత సంవత్సరం ఆగస్టు లో వర్షాలు రాలేవు అప్పుడు బీఆరెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అన్నారు. వర్షాలు పడకపోవడానికి బీఆర్ఎస్ కారణం కాదని.. ఆ అవగాహన నాకు ఉందన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 4 నెలల తరువాత బయటకు వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. 4 నెలలుగా మాట మాట్లాడకుండా కాళేశ్వరం కృంగినప్పుడు చేయకుండా ప్రభుత్వానికి సరైన సలహా చెప్పకుండా ఈరోజు బయటకు వచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్నారు 200 మంది రైతులు చనిపొయారని కరువు కాంగ్రెస్ వల్లే వచ్చిందని అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని కరువు రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు ఉన్న నీళ్లను తాగు, సాగు కు ఎలా వాడుకోవాలో అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని సాగు,తాగు నీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ రాజకీయం చేయాలని చేస్తున్నారన్నారు.

పార్లమెంటు ముందు రైతులు కొట్లాడినప్పుడు, చనిపోయినప్పుడు బండి సంజయ్ కనిపించలేదని ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆస్కార్ అవార్డు గ్రహిత డ్రామాలు స్టార్ట్ చేశాడని బండి సంజయ్ ని ఉద్దేశించి మంత్రి పొన్నం పున్నం ప్రభాకర్ విమర్శించారు. బండి సంజయ్ కి చిత్త శుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుండి నిధులు ఇవ్వమని ప్యాకేజీ ఇవ్వమని కేంద్రాన్ని అడగాలన్నారు. ఆరు గ్యారంటీ స్కీమ్స్ గురించి అడుగుతున్న బండి సంజయ్ ని 15 లక్షలు ఏమయ్యాయి, 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని విభజన హామీలు ఏమయ్యాయని విమర్శించారు. ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్నామని 500 కే గ్యాస్ అందిస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. వర్షాలు పడలేదు రైతులను అధైర్యపెట్టే ప్రయత్నం చేయద్దన్నారు.

Spread the love

Related News

Latest News