ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 2: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో పాపన్న గౌడ్ చిత్రపటానికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమకారుడు బహుజనులకు ఆదర్శ ప్రయుడు, బహుజనుల హక్కుల కోసం ఏవిధంగా పోరాడినారో ఈతరానికి స్ఫూర్తి అన్నారు. కుల గణన సర్వే చేపట్టామని ఇప్పటికే 17 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు. సమాజంలో మార్పు రావాలన్న అందరు సర్వాయి పాపన్న ఆలోచనలతో ముందుకు రావాలని.. సామాజిక స్ఫూర్తి దాత ఉద్యమకారుడు ఆయన ఆలోచనలను వారసులుగా మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి నెంబర్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంక చందు, అక్కు శ్రీనివాస్, బుక్య సరోజన, పున్నసది పెరుమాండ్ల నర్సాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.