Trending Now

చేతులెత్తి మొక్కుతున్నా.. బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు..

మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వాఖ్యలు..

ప్రతిపక్షం, తెలంగాణ: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దంటూ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు యాత్రను అడ్డుకుంటారని బీజేపీ నేతలు సెక్యూరిటీ కోరితే ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ క్రమంలో బండి సంజయ్ యాత్రకు బందోబస్తు కల్పించాల్సి వస్తే పరీక్షా కేంద్రాల వద్ద సెక్యూరిటీ లేకుండా పోతుందన్నారు. ఇతరత్రా శాంతిభద్రతల సమస్యలు ఎదురవుతాయని, అందుకే బండి యాత్రను అడ్డుకోవద్దని చెప్పారు. అదే సమయంలో రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని బీజేపీ నేతలకు హితవు పలికారు. ఈ మేరకు బుధవారం ఉదయం పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఓ వీడియో ట్వీట్ చేశారు.

Spread the love

Related News

Latest News