ప్రతిపక్షం, హుస్నాబాద్ ఏప్రిల్ 9: బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయం హుస్నాబాద్ లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరికి శ్రీ క్రొధి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరిగి అభివృద్ధి జరగాలని కోరారు. అనంతరం అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆశీర్వదించారు. హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్.. అగ్గిపెట్టెలు ఇమిడే ప్రత్యేక బంగారం పూతతో ధరించిన పట్టు వస్త్రాన్ని సిరిసిల్ల నుంచి ప్రత్యేకంగా తెప్పించి మంత్రి పున్నం ప్రభాకర్ ని ఘనంగా సన్మానించారు.
మున్సిపల్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు శ్రీ మరకత లింగేశ్వర స్వామి ఆలయం ఆవరణలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత ఆధ్వర్యంలో శ్రీ క్రొదినామ ఉగాది పంచాంగ శ్రవణ పూజ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ పట్టణానికి మంచి జరగాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మరింత అభివృద్ధిలో దూసుకుపోవాలని కోరారు. 70 సంవత్సరాల చరిత్రలో హుస్నాబాద్ కు మొదటిసారిగా మంత్రి పదవి వచ్చిందని మంత్రి అండదండలతో పట్టణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ అయిలేని అనితారెడ్డి, కౌన్సిలర్లు నళినిదేవి వాల సుప్రజా నవీన్ భోజు రమాదేవి చిత్తారి పద్మ బోల్లి కల్పనా శ్రీనివాస్ భూక్య సరోజన ఉన్న లావణ్య సది వల్లపు రాజు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కో ఆప్షన్ నెంబర్లు ఐలేని శంకర్, ఎండీ అయూబ్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, టిపిసిసి మెంబర్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు చిత్తరి రవీందర్, కర్ణకంటి మంజులారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.