ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 1: నేడు అంతర్జతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లకు, సిబ్బందికి ఇతర కార్మిక లోకానికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో కార్మికులకు అసలైన గౌరవం లభిస్తుందని, శ్రామిక లోకం అభివృద్ధిలో అసలైన పునాదులని మంత్రి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్మిక దినోత్సవం మీ లక్ష్యాలు, ఆకాంక్షలను అభిరుచి దృడ సంకల్పంతో కొనసాగించేందుకు మీకు నూతన శక్తిని, ప్రేరణను అందించాలని.. ‘మే’ డే సందర్భంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం.