ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 17 : హిందువుల ఆరాధ్యదైవం సీతారాముల కళ్యాణ మహోత్సవ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యపాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని.. అన్యోన్య దాంపత్యానికి పుణ్యదంపతులైన సీతారాములు ఆదర్శనీయులన్నారు. ఆ సీతారాముల కరుణకటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందేలా, ప్రజలందరూ సుఖ, సంతోషాలతో జీవించేలా దీవించాలని ఆ సీతారామచంద్రులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రార్థించారు.