ప్రతిపక్షం, హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజ్ ను కాంగ్రెస్ పార్టీ చూడడానికి వెళ్తే బొందల గడ్డను చూసి ఏం పీకుతారు? అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఏం పీకడానికి.? తన మానస పుత్రిక అంటూ మేడిగడ్డను సంబోధించి ఆ తర్వాత బొందల గడ్డ అంటున్న కేసీఆర్ ద్వందనీతి ఏమిటనీ..? రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ధ్వజమెత్తారు. ఆదివారం షాద్ నగర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. మేడిగడ్డను మానస పుత్రిక అంటూ సంబోధించి ఆ తర్వాత బొందలగడ్డగా మార్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యలో లక్ష కోట్లు ఖతం చేశాడంటూ తీవ్ర విమర్శలు చేశారు. గత పది సంవత్సరాలలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
ప్రజలకు అవసరమైన వైద్య ఆరోగ్యం, నిరుద్యోగం తదితర ముఖ్యమైన సమస్యలపై ఏనాడైనా స్పందించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు పూర్తయ్యాయని ఆరు గ్యారెంటీలలో దాదాపు అన్ని పూర్తి చేయబోతున్నామని అన్నారు. రాష్ట్ర ఖజానాను ఎలా ఖాళీ చేశారో ప్రజా సొమ్మును ఎలా దోచుకుతున్నారో ? శ్వేత పత్రం ద్వారా అసెంబ్లీలో పత్రాలను తమ విడుదల చేస్తే దీనికి పోటీగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్వేద పత్రాలు అంటూ ముందుకు తెచ్చారని, రాష్ట్రాన్ని చమటతో నిర్మించామని అసత్యపు మాటలు మాట్లాడుతూ స్వేద పత్రాలు విడుదల చేశారని ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.